మార్కెట్లోకి ఎసి జాకెట్లు

By udayam on May 3rd / 11:02 am IST

ఎండలు మండిపోతుంటే బయటకెలా వెళ్ళాలని ఆలోచిస్తున్నారా? మీ కోసమే ఓ ఏసి జాకెట్​ మార్కెట్​లో అమ్మకానికి రెడీగా ఉంది. ఏకంగా 4 ఫ్యాన్లు ఉండే ఈ జాకెట్​ దాదాపు 10 గంటల పాటు ఎండలో నిరంతరాయంగా చల్లటి గాలిని శరీరానికి అందిస్తుంది. రూ.12–13 వేల ధరకు అందుబాటులోకి వస్తున్న ఈ జాకెట్​లో 18 వాట్​ బ్యాటరీ ఉండనుంది. మెషీన్​లో వాష్ చేసుకునే వీలున్న ఈ జాకెట్​ 100 శాతం పాలిఎస్టర్​ క్లాత్​తో కుట్టబడింది.

ట్యాగ్స్​