ముంబై నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో వరకూ నాన్ స్టాఫ్ ఫ్లైట్ ను గురువారం నుంచి నడుపుతున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. వారానికి మూడు రోజులు (మంగళ, గురు, శని వారాలు) ఈ ఫ్లైట్ ముంబై నుంచి బయల్దేరుతుందని ప్రకటించింది. బోయింగ్ 777–200 ఎల్ ఆర్ విమానాన్ని ఈ ప్రయాణం కోసం ఎయిర్ ఇండియా వినియోగించనుంది. త్వరలోనే ఫ్రాంక్ ఫర్ట్, పారిస్, న్యూయార్క్ నగరాలకు సైతం ఈ సర్వీసును తీసుకురానున్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది.