ఇటీవలే ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూప్ తాజాగా తన సిబ్బంది ఆహార్యంపై మార్గదర్శకాలను విడుదల చేసింది. విమాన ప్రయాణికులకు సేవలందించే సిబ్బంది మెడలో, చేతులకు, కాళ్ళకు ఎలాంటి మత పరమైన తాయత్తులు, దారాలు వంటివి ఉండకూడదని స్పష్టం చేసింది. మతపరమైన చెవి రింగులతో పాటు ముక్కు పుడకలు కానీ, ఆభరణాలు కానీ ధరించకూడదని పేర్కొంది. అలాగే బట్టతల ఉండే వాళ్లు తప్పనిసరిగా గుండు చేయించుకోవాలని, తెల్లజుట్టు ఉండకూడదని కూడా వెల్లడించింది.