ఆసుపత్రుల్లో కరోనా గాలి

బాత్​రూమ్స్​, ఐసియు వార్డుల్లో సైతం

By udayam on December 26th / 8:10 am IST

కరోనా వైరస్​ రోగులకు చికిత్స అందించే ఆసుపత్రి లోపలి గాలిలో కరోనా వైరస్​ శాంపిల్స్​ లభ్యమయినట్లు ఓ నివేదిక వెల్లడించింది.

ఈ ఆసుపత్రుల్లోని ఐసియు వార్డులు, బాత్​రూమ్​లలోనూ ఈ వైరస్​ జాడ అత్యధిక స్థాయిలో లభ్యమయినట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఐసియు వార్డుల కంటే సాధారణ వార్డుల్లోనే ఈ వైరస్​ జాడ కాస్త తక్కువుగా ఉందని పేర్కొంది.

మొత్తం 471 గాలి శాంపిల్స్​ను పరీక్షించగా అందులో 82 శాంపిల్స్​లో కరోనా వైరస్​ జాడ అత్యధిక స్థాయిలో కనిపించిందని తెలిపింది. 107 ఐసియు వార్డు శాంపిల్స్ లో 27 చోట్ల, 364 సాధారణ వార్డు శాంపిల్స్ లో 39 చోట్ల ఈ వైరస్​ జాడ కనిపించిందని తెలిపింది.

అదే బాత్​రూమ్స్​లో 21 గాలి శాంపిల్స్​ పరీక్షిస్తే 5 చోట్ల, 242 వైద్య పరిసరాల శాంపిల్స్ లో 20 చోట్ల, 122 ఆసుపత్రి ఉద్యోగులు ఉండే ప్రాంతాల్లో 15 చోట్ల ఈ వైరస్​ జాడ లభ్యమైనట్లు పేర్కొంది.

చైనా, అమెరికా, హాంగ్​కాంగ్​, కొరియా, సింగపూర్​, ఇరాన్​, యునైటెడ్​ కింగ్​డమ్​లలోని ఆసుపత్రుల్లోని గాలుల్లో ఈ పరీక్షలు నిర్వహించినట్లు నివేదిక వెల్లడించింది.