ఎయిర్‌ సువిధ పై కేంద్రం వెసులుబాటు

By udayam on November 22nd / 9:50 am IST

కరోనా పీక్​ టైం లో కేంద్రం తీసుకువచ్చిన ఎయిర్​ సువిధ విధానంపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఇకపై విదేశాల నుంచి మన దేశానికి వచ్చే విమాన ప్రయాణికులు కరోనా సంబంధిత వివరాలతో ‘ఎయిర్‌ సువిధ’ ఫారాన్ని నింపాల్సిన అవ‌స‌రం లేదని పేర్కొంది. దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్న నేపధ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం తక్షణం అమలులోకి రానున్నట్లు తెలిపింది. కరోనా లేదని తెలిపే ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష నివేదికను గానీ, టీకా తీసుకున్నట్లు ధ్రువీకరించే పత్రాన్ని గానీ సమర్పించాల్సిన అవసరం కూడా లేదని ప్రకటించింది.

ట్యాగ్స్​