ఎయిర్ టెల్ తమ వినియోగదారులపై మరోసారి ఛార్జీల భారాన్ని మోపింది. ఇకపై నెలవారీ కనీస రీచార్జ్ ధరను రూ.155గా పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఆ నెట్ వర్క్ లో కనీస నెలవారీ ప్రీపెయిడ్ రీఛార్జ్ రూ.99గా ఉంది. అయితే ఈ ప్లాన్ ను తొలి విడతగా హర్యానా, ఒడిశా సర్కిళ్లలో ఎత్తేసిన ఆ సంస్థ దాని స్థానంలో రూ.155 రీఛార్జ్ ప్లాన్ ను ప్రకటించింది. ఇక్కడ పరిశీలించిన తర్వాత రూ.99 ప్లాన్ ను దేశవ్యాప్తంగా తొలగించి దాని స్థానంలో రూ.155 ప్లాన్ ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది.