5జి సేవలు తీసుకొచ్చిన ఎయిర్​టెల్​

By udayam on October 4th / 9:41 am IST

భారత్​లో 5జి సర్వీసులు ఇలా మొదలయ్యాయో లేదో టెలికాం ఆపరేటర్లు తమ 5జి సేవలను తీసుకొచ్చేస్తున్నాయి. అందరికంటే ముందుగా భారతి ఎయిర్​టెల్​ దేశంలోని 8 నగరాల్లో ఈ 5జి సర్వీసుల్ని మొదలెట్టేశాయి. మార్చి 2024 నాటికి దేశం మొత్తం 5జి సేవల్ని తీసుకొస్తామని ప్రకటిస్తోంది ఈ కంపెనీ. అదే సమయంలో రియలెన్స్​ జియో ఈ రేసులో కాస్త వెనుకబడింది. ఈ నెలాఖరుకు కానీ జియో తమ 5జి సేవల్ని తీసుకొచ్చే అవకాశాలు కనిపించడం లేదు. వొడాఫోన్​–ఐడియాలతో పాటు బిఎస్​ఎన్​ఎల్​ సైతం ఈ సేవల్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి.

ట్యాగ్స్​