విశాఖ నగరంలోని తమ వినియోగదారులకు ఈరోజు నుంచి 5జి + సేవల్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఎయిర్ టెల్ ప్రకటించింది. ఇప్పటికే హైదరాబాద్ వాసులకు 5జి ని పరిచయం చేసిన ఎయిర్ టెల్ ఇప్పుడు విశాఖ లోనూ ఈ సర్వీసును ప్రారంభించింది. ప్రస్తుతం విశాఖలోని ద్వారకా నగర్, బీచ్ రోడ్డు, దాబా గార్డెన్స్, మద్దిలపాలెం, వాల్తేర్ అప్ ల్యాండ్స్, పూర్ణా మార్కెట్, గాజువాక జంక్షన్, ఎంవిపి కాలనీ, రాంనగర్, రైల్వే స్టేషన్ రోడ్డు, తెన్నేటి నగర్ లలో 5జి+ సేవలు అందుబాటులోకి వచ్చాయి.