దేశంలోనే అతిపెద్ద టెలికాం బ్రాండ్ ఎయిర్టెల్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్ ను తీసుకొచ్చింది. తన డిటిహెచ్ కనెక్షన్ తో పాటు 17 ఓటిటి సబ్స్క్రిప్షన్లను కూడా ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఎయిర్టెల్ బ్లాక్ ప్రియారిటీ కేర్ కింద నెలకు రూ.1599, రూ.1099, రూ.699 సబ్స్క్రిప్షన్లతో ఈ ఆఫర్ను అందించనుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, సోనీలివ్, ఈరోస్ నౌ, లయన్స్ గేట్ ప్లే, మనోరమా మ్యాక్స్ వంటి టాప్ ఓటిటి యాప్లను సైతం ఎయిర్టెల్ అందిస్తోంది.