ఎయిర్​టెల్​ 5జి సేవలు సిద్ధం

తొలిసారిగా హైదరాబాద్​లో పరీక్షించిన టెలికాం దిగ్గజం

By udayam on January 28th / 7:56 am IST

భారత టెలికాం దిగ్గజ సంస్థ అయిన ఎయిర్​టెల్​ 5జి సేవలకి సిద్ధమైనట్లు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్​లో తొలిసారిగా 5జి కమర్షియల్​ సర్వీస్​ను పరీక్షించినట్లు వెల్లడించింది.

దీంతో దేశంలో తొలిసారిగా 5జి సేవల్ని పరీక్షించిన సంస్థ తమదేనని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 5జి స్పెక్ట్రమ్​ వేలం తర్వాత, ఈ సేవలకు అనుమతులు ఇవ్వగానే తమ వినియోగదారులకు ఈ సేవల్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఎయిర్​టెల్​ సిఇఓ గోపాల్​ విట్టల్​ వెల్లడించారు.

ఈ 5జి సేవల్ని పరీక్షించడం కోసం హైదరాబాద్​ ప్రాంతంలో ఇప్పటికే తమ వద్ద 1800 ఎంహెచ్​జెడ్​ స్పెక్ట్రమ్​ను వినియోగించామని వెల్లడించింది.

దీంతో ఈ ప్రాంతంలోని యూజర్లు తమ 5జి ద్వారా కేవలం సెకండ్ల వ్యవధిలోనే ఫుల్​ హెచ్​ సినిమాను తమ మొబైల్​ ఫోన్లలో డౌన్ ​లోడ్​ చేసుకునే అవకాశం దక్కనుందని వెల్లడించింది.

తమ 5జి నెట్​వర్క్​ వల్ల 10 శాతం అత్యధిక స్పీడుతో పాటు, 10 వేగవంతమైన నెట్​వర్క్​తో పాటు 100 శాతం అత్యంత ఖచ్చితత్త్వమైన సిగ్నల్​ లభిస్తుందని వెల్లడించింది.

ట్యాగ్స్​
Source: india today