ఐశ్వర్య రాయ్​ కు పన్ను నోటీసులు

By udayam on January 18th / 6:33 am IST

బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ కు పన్ను చెల్లించలేదంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. మహారాష్ట్రలోని నాసిక్‌లోని సిన్నార్‌లోని అవడి ప్రాంతంలో ఐశ్వర్యకు భూమి ఉంది. దీనికి సంబంధించి ఆమె రూ.22 వేలు పన్ను చెల్లించాల్సి ఉంది. ఏడాది నుంచి పన్ను చెల్లించకపోవడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. ఐశ్వర్యతో పాటు మరో 1200 మందికి నోటీసులు అందాయి. వీరంతా రూ.1.11 కోట్ల మేర పన్ను చెల్లించాల్సి ఉంది.

ట్యాగ్స్​