దేశంలోని పలు భాషల్లో సూపర్ హిట్ కొట్టిన ‘దృశ్యం’కు తాజాగా దృశ్యం 2 సీక్వెల్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
మోహన్‌లాల్, మీనాలు జంటగా నటించిన ఈ చిత్రం అమెజాన్‌లో విడుదలై హిట్ టాక్ సంపాదించుకుంది. దీంతో దీన్ని కూడా బాలీవుడ్లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
హిందీ దృశ్యంలో నటించిన అజయ్ దేవ్గన్, టబు లే కీలక పాత్రధారలుగా దృశ్యం 2 ను రూపొందించాలని నిర్ణయించారు. ఇందుకు గానూ నిర్మాత కుమార్ మంగత్ మళయాళ నిర్మాతలకు పెద్ద మొత్తంలో ఆఫర్ చేసి హిందీ రైట్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాదిలోనే చిత్రీకరణ మొదలుపెట్టి నవంబర్‌లో దృశ్యం –2 హిందీ వర్షన్‌ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.