రహానేకు ఘన స్వాగతం

By udayam on January 21st / 11:00 am IST

బోర్డర్​ – గవాస్కర్​ ట్రోఫీని గెలుచుకుని ఈరోజు భారత్​కు చేరుకున్న భారత తాత్కాలిక సారధి అజింక్యా రహానెకు ఘన స్వాగతం లభించింది. మేళతాళాల మధ్య రహానేతో పాటు ఆయన కుటుంబ సభ్యుల్ని ముంబై లో ఘనంగా ప్రజలు సత్కరించారు.

1–0తో సిరీస్​లో వెనుకబడిన అనంతరం కెప్టెన్సీ బాధ్యతలు తీసుకుని 2–1 తేడాతో సిరీస్​ను గెలవడానికి విశేషంగా రాణించిన రహానేకు ఆయన అభిమానులు ఘనంగా స్వాగతం పలుకుతున్న వీడియోలు, ఫొటోలు ఆన్​లైన్​లో వైరల్​ అవుతున్నాయి.

రహనేతో పాటు రోహిత్​ శర్మ, కోచ్​ రవి శాస్త్రిలు సైతం ఈరోజు ముంబైకు చేరుకున్నారు. అయితే వీరంతా వీలైనంత త్వరగా చెన్నైలో ఇంగ్లాండ్​ సిరీస్​ కోసం ఏర్పాటు చేసిన బయోబబుల్​లో జాయిన్​ అవ్వాల్సి ఉంది.