రహానే డబుల్​ సెంచరీ.. జట్టులోకి తిరిగొచ్చేలా ఉన్నాడే!

By udayam on December 21st / 12:33 pm IST

భారత జట్టుకు దూరమైన అజింక్య రహానె రంజీ ట్రోఫీలో డబుల్ సెంచరీతో దుమ్మురేపాడు. ముంబై వేదికగా హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్ లో వరుసగా రెండో రోజు అద్భుత బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ గా ముంబైని నడిపిస్తున్న రహానె 261 బంతుల్లో 26 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 204 పరుగులు చేశాడు. తొలి రోజే సెంచరీ పూర్తి చేసుకున్న రహానె రెండో రోజు, బుధవారం ద్విశతకం సాధించాడు. అతనితో పాటు యశస్వి జైస్వాల్ (162), సర్ఫరాజ్ ఖాన్ (126 నాటౌట్) శతకాలతో చెలరేగడంతో ముంబై తొలి ఇన్నింగ్స్ ను 651/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.

ట్యాగ్స్​