కోలీవుడ్ స్టార్ హీరో తాలా అజిత్ కుమార్ లేటెస్ట్ మూవీ ‘తూనివు’ (తెలుగులో తెగింపు) ట్రైలర్ ను ఈ డిసెంబర్ 31న విడుదల చేయనున్నట్లు టాక్. హీస్ట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీపై అభిమానుల్లో భారీ క్రేజ్ ఉంది. పొంగల్ 2023 కానుకగా ఈ మూవీని జనవరి 13న తెలుగుతో పాటు తమిళం భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు. మంజూ వారియర్, సముద్రఖని కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు వలిమై ను డైరెక్ట్ చేసిన హెచ్. వినోద్ దర్శకత్వం వహించాడు.