అజిత్ హీరోగా తెరకెక్కిన హీస్ట్ మూవీ ‘తునివు’ కు సెన్సార్ బోర్డ్ గట్టి షాకే ఇచ్చింది. ఏకంగా ఈ మూవీకి 13 కట్ లు చెప్పిన బోర్డ్.. ఆ తర్వాత ఈ మూవీకి యు/ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది. CBFC 13 ప్రకారం ఈ మూవీలో చాలా సీన్లు 13 ఏళ్ళ లోపు చిన్నారులకు ఇబ్బందికరంగా ఉన్నాయంటూ సెన్సార్ బోర్డ్ ఈ కోతలను విధించింది. అనంతరం ఈ మార్పులు చేసిన తర్వాతనే మూవీకి సర్టిఫికెట్ జారీ చేసింది.