షూటింగ్ లో అజిత్ కి గాయాలు

By udayam on November 20th / 9:20 am IST

హైదరాబాద్‌: ‘వలిమై’ సినిమా షూటింగ్‌లో తమిళ హీరో అజిత్‌కు ప్రమాదం జరిగి, గాయపడ్డారు. బైక్‌తో రిస్కీ స్టంట్స్‌ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

అజిత్‌ చేతికి, కాళ్లకు గాయాలవడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో అజిత్ కొన్ని రోజులు షూటింగ్‌‌కు దూరం జరగాల్సి రావచ్చు.

‘వలిమై’ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. దీనికి సంబంధించి బైక్ చేజింగ్‌కు సంబంధించి అజిత్​ స్వయంగా డూప్​ లేకుండా బైక్​ చేజ్​ స్టంట్స్​ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

హుమా ఖురేషి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి హెచ్.వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా  సంగీతం అందిస్తున్నారు.