అఖండ పాన్​ వరల్డ్​ మూవీ : బాలయ్య

By udayam on January 12th / 10:12 am IST

తన తాజా చిత్రం అఖండ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోందని నటుడు బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్​లో జరిగిన సినిమా విజయోత్సవ సభలో మాట్లాడిన ఆయన కొవిడ్​ సమయంలో ‘అఖండ’ చిత్రం జనాన్ని ధియేటర్లకు రప్పించిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కాకుండా పాకిస్థాన్​తో పాటు విడుదలైన దేశాలన్నింటిలోనూ ఈ మూవీ విజయాన్ని అందుకుందని ప్రకటించారు. సినిమా టికెట్ల విషయంపై ఇండస్ట్రీ మొత్తం కలిసి ఉండాలన్న ఆయన.. ఇండస్ట్రీ తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడతానన్నారు.

ట్యాగ్స్​