ఏప్రిల్ 14న అఖిల్​ ‘ఏజెంట్​’!

By udayam on December 31st / 4:56 am IST

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. స్పై థ్రిల్లర్‌ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య నటిస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఏప్రిల్ 14, 2023న థియేటర్లలోకి రానుందని సమాచారం. ఈ మేరకు జనవరి 1న రిలీజ్​ పోస్టర్​ లాంచ్​ కానుంది.

ట్యాగ్స్​