యూట్యూబర్​పై అక్షయ్ రూ.500 కోట్ల పరువునష్టం

సుశాంత్​ కేసును తనకు లింక్​ పెట్టినందుకే అన్న స్టార్ హీరో

By udayam on November 20th / 10:25 am IST

బాలీవుడ్​ సూపర్​ స్టార్​ అక్షయ్​ కుమార్​ రిషిద్​ సిద్దిఖి అనే యూట్యూబర్​పై 500 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశాడు.

దివంగత బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ మరణానికి తనను బాధ్యుడిగా చేస్తూ తప్పుడు వార్తలు ప్రచారం చేసినందుకు అక్షయ్​ ఈ యూట్యూబర్​పై కఠిన చర్యలకు దిగాడు.

సిద్దిఖి యూట్యూబ్​లో పెట్టిన ఓ వీడియోలో సుశాంత్​ సింగ్​ ‘ఎం.ఎస్​.ధోని – ది అన్​టోల్డ్​ స్టోరీ’ వంటి పెద్ద సినిమాలకు ఎంపికవ్వడం అక్షయ్​ జీర్ణించుకోలేకపోతున్నాడని ఆరోపణలు చేశాడు. అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు ఆదిత్య థాక్రే, ముంబై పోలీసులతో రహస్య మంతనాలు కూడా నెరపినట్లు అదే వీడియోలో ఆరోపించాడు.

దాంతోపాటు సుశాంత్​ గర్ల్​ఫ్రెండ్​ రియా చక్రవర్తికి సైతం అక్షయ్​ సాయం చేశాడని, ఆ సాయంతోనే ఆమె కెనడాకు పారిపోయిందని ఆరోపించాడు. ఇలాంటి అర్ధంలోని ఆరోపణలతో పెట్టిన వీడియోల ద్వారా అతడు 15 లక్షల రూపాయలను సంపాదించడమే కాకుండా యూట్యూబాలో తన సబ్​స్క్రైబర్లను 2 నుంచి 3లక్షలకు పెంచుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ యూట్యూబార్​ అక్షయ్​ ఒక్కడిపైనే కాకుండా చాలా మంది సెలబ్రిటీలపై ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని యూట్యూబ్​ వేదికగా చేశాడని పోలీసులు పరిశోధనలో తేల్చారు.