భారత ఎంపీ నూపూర్ శర్మ ముస్లింలపై గతంలో చేసిన వ్యాఖ్యలపై అల్ ఖైదా తాజాగా మరోసారి స్పందించింది. అరబ్ దేశాలలోని ముస్లింలు భారత ఉత్పత్తులను బ్యాన్ చేయాలని, అరబ్ దేశాల నుంచి భారతీయ పనివాళ్ళను వెనక్కి పంపాలని డిమాండ్ చేసింది. ముస్లింలు, ఇస్లామిక్ దేశాలు ఈ విషయంలో కలసికట్టుగా భారత్ కు వ్యతిరేకంగా పనిచేయాలని పిలుపునిచ్చింది. కశ్మీర్ వ్యాలీలోని ముస్లింలకు అండగా ఉండాలని కూడా అల్ ఖైదా మీడియా తన ప్రకటనలో పేర్కొంది.