ఇటీవల కూతురికి జన్మనిచ్చిన బాలీవుడ్ కపుల్ రణ్ బీర్ కపూర్ – అలియా భట్ లు తమ చిన్నారి పేరును ప్రకటించారు. తనకు ‘రహ’ అనే పేరును పెట్టినట్లు గురువారం ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించారు. రన్బీర్ తల్లి నీతు కపూర్ తన మనవరాలికి ఈ పేరును సూచించినట్లు అలియా పేర్కొంది. ‘ఈ పేరును వాళ్ళ నానమ్మ పెట్టింది. దీనికి ఎన్నో మంచి అర్ధాలు ఉన్నాయి’ అంటూ అలియా తన పోస్ట్ లో పేర్కొంది. నవంబర్ 6న అలియా తన కూతురుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.