అలీబాబా అధినేత జాక్ మా ను చైనా పోలీసులు అరెస్ట్ చేయనున్నారన్న వార్తల నేపధ్యంలో.. ఈ సంస్థ రూ.2 లక్షల కోట్ల మార్కెట్ వాల్యూను కోల్పోయింది. కంపెనీ షేర్లు నిమిషాల వ్యవధిలో 10 శాతం మేర నష్టపోవడంతో ఈ భారీ నష్టాన్ని చవి చూసింది. అయితే జాక్ మా ను పోలీసులు అరెస్ట్ చేయట్లేదని చైనా మీడియాలో వార్తలు వచ్చాయి. కేవలం అదొక రూమర్ మాత్రమేనని గ్లోబల్ టైమ్స్ ప్రకటించింది. మా అనే ఇంటిపేరున్న వ్యక్తిని అరెస్ట్ చేశారని.. అతడు జాక్ మా కాదని పేర్కొంది.