మన పాలపుంతలోనే ఉన్న 30 కోట్ల ఆవాస యోగ్య గ్రహాల్లోనే ఎక్కడో ఓ చోట ఏలియెన్స్ ఇదివరకు ఉండేవని తాజాగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
అయితే వారు మన కంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించే కాలంలో వారి సొంత టెక్నాలజీనే వారిని అంతం చేసి ఉండొచ్చని సైతం తాజాగా ఓ నివేదికలో పేర్కొన్నారు.
ఈ కారణం చేతనే మనం ఎంత ప్రయత్నించినా వారి జాడ కనిపెట్టలేకపోతున్నామని ఈ నివేదికలో వెల్లడించారు.
‘‘మన గేలాక్సీలోని ఏదో ఓ గ్రహం ఉపరితలంపై ఏలియెన్స్ కళేబరాలు మనకు కనిపించొచ్చు. వారి సొంత టెక్నాలజీనే వారిని అంతం చేసి ఉండొచ్చు” అని ఈ నివేదిక వెల్లడిస్తోంది.
1961 డ్రేక్ ఈక్వేషన్ ను మరింత అభివృద్ధి చేసే పనిలో భాగంగా పరిశోధనలు చేసిన నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ, కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, శాంటిగో హై స్కూల్ శాస్త్రవేత్తలు ఈ తాజా నివేదికను తయారు చేశారు.
ఈ డ్రేక్ ఈక్వేషన్ ఆధారంగానే మన పాలపుంతలో ఉండే ఆవాస యోగ్య గ్రహాలు, వాటి నక్షత్రాలను శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్న విషయం తెలిసిందే.