తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు స్థాపించిన జాతీయ పార్టీ ‘భారత రాష్ట్ర సమితి’ ఆవిర్భావ సభ నేడు ఖమ్మంలో జరగనుంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, దిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీరితో పాటు పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు తరలివస్తున్నారు. విజయన్, కేజ్రీవాల్, అఖిలేశ్ యాదవ్ తదితరులు ఇప్పటికే ఖమ్మం చేరుకున్నారు.
ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధం 💥💥
రేపు ఖమ్మంలో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ తొలి బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోనున్నది. ఈ సభ నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ దేశానికి దిశానిర్దేశం చేయనున్నారు.#BRSParty #KCR pic.twitter.com/qwhjlkxNVs
— BRS News (@BRSParty_News) January 17, 2023