9న శాకుంతలం ట్రైలర్​ లాంచ్​

By udayam on January 7th / 7:36 am IST

క్రేజీ హీరోయిన్ సమంత నుండి రాబోతున్న తొలి మైథలాజికల్ మూవీ “శాకుంతలం”. ట్యాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్షన్లో మైథలాజికల్ ఎపిక్ లవ్ స్టోరీ గా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ ట్రైలర్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు శాకుంతలం ట్రైలర్ జనవరి 9వ తేదీ మధ్యాహ్నం 12:06 నిమిషాలకు విడుదల కాబోతుందని పేర్కొంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు. వచ్చే నెల 17వ తేదీన విడుదల కావడానికి రెడీ అవుతుంది.

ట్యాగ్స్​