కేరళ: మహిళా స్పీకర్​ ప్యానల్​ ఏర్పాటు చేసిన సర్కార్​

By udayam on December 5th / 10:23 am IST

రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో కేరళ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ చరిత్రలోనే తొలిసారిగా మహిళా స్పీకర్ ప్యానెల్ ను ఏర్పాటు చేసింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేనప్పుడు ఈ ప్యానెల్ సభా కార్యకలాపాలను నియంత్రిస్తుంది. మహిళలు అన్నింటా సమానమని, విద్య, వైద్య, వ్యాపారం సహా అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభ చాటుకుంటున్నారని కేరళ ప్రభుత్వం పేర్కొంది.

ట్యాగ్స్​