నరేష్ ​: రాజకీయాలు నా ఒంటికి సరపడవు

By udayam on November 24th / 10:12 am IST

సినీ నటుడు అల్లరి నరేష్ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వాటికీ క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలు నాకు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ అని.. రాజకీయాల్లోకి రానని తేల్చి చెప్పారు. సున్నితంగా ఉండే నా లాంటి వాళ్ళకి రాజకీయాలు సరిపోవన్నారు. అల్లరి నరేష్ నటించిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాంది హిట్ తర్వాత నరేష్ నుండి వస్తున్న సినిమా కావడం , ట్రైలర్ , టీజర్స్ సైతం ఆకట్టుకోవడం తో సినిమా ఫై ఆసక్తి నెలకొంది.

ట్యాగ్స్​