పుష్ప.. బన్నీ కెరీర్ ను అమాంతం పాన్ ఇండియా స్థాయికి చేర్చిన ఈ మూవీ ఇప్పుడు కేరళలో మరోసారి రీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఆ రాష్ట్రంలో బన్నీకి భారీ ప్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. పుష్ప–2 కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అక్కడి జనాలు.. ఇప్పట్లో ఆ మూవీ రాదని లేట్ గా అర్ధం చేసుకున్నట్లున్నారు. దీంతో డిసెంబర్ 17 నాటికి పుష్ప రిలీజ్ అయి ఏడాది అవుతున్న సందర్భంగా ఆ మూవీని తిరిగి కేరళలో భారీ స్థాయిలో రీ రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి ఈ4 ఎంటర్ టైన్మెంట్ సంస్థ వీలైనన్ని ఎక్కువ ధియేటర్లలో ఈ మూవీని రన్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.