నగ్మా : రాజ్యసభకి నేను అర్హురాలిని కాదా?

By udayam on May 30th / 7:27 am IST

ప్రతిపక్ష కాంగ్రెస్​లో మళ్ళీ లుకలుకలు మొదలయ్యాయి. ఆ పార్టీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు వెలువడగానే టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు ఒక్కసారిగా భగ్గుమంటున్నారు. పవన్​ ఖేరా అనే సీనియర్​ కాంగ్రెస్​ నేత ‘బహుశా నా తపస్సులో ఏదో లోపం ఉండొచ్చు’ అంటూ అందరికంటే ముందు ట్వీట్​ చేశాడు. అనంతరం మహారాష్ట్ర కాంగ్రెస్​ నాయకురాలు, మాజీ నటి నగ్మా సైతం ‘2003–04 లో సోనియా పిలిచి మరీ కాంగ్రెస్​లో చేర్చుకుని రాజ్యసభకు పంపుతానన్నారు. 18 ఏళ్ళు గడిచినా నాకు ఆ అవకాశం దక్కలేదు’ అంటూ ట్వీట్​ చేశారు.

ట్యాగ్స్​