తెలంగాణలో అమర రాజా భారీ ప్లాంట్!!

By udayam on December 2nd / 11:04 am IST

అమర రాజా గ్రూపుకు చెందిన అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ తెలంగాణలో భారీ పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. ఆ మేరకు ఈరోజు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు అమర రాజా సంస్థ ప్రకటించింది. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ లిథియం-అయాన్ బ్యాటరీ పరిశోధన, తయారీ సంస్థను ప్రారంభించనున్నట్టు ఆ సంస్థ తెలిపింది. వచ్చే పదేళల్లో ఈ పరిశ్రమపై రూ. 9500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నట్టు అమర రాజా బ్యాటరీస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్ ప్రకటించారు.

ట్యాగ్స్​