అలెక్సా ఫైర్​ టివి ఇప్పుడు హిందీలో

సరికొత్త ఫీచర్​ను తీసుకొచ్చిన అమెజాన్​

By udayam on November 19th / 9:46 am IST

అమెజాన్​ తన ఫైర్​ టివి రిమోట్​లోని అలెక్సా డివైజ్​కు హిందీ భాషను జత చేసింది. ఇప్పటి వరకూ కేవలం ఇంగ్లీష్​లో మాత్రమే ఫైర్​ టివి స్టిక్​ ద్వారా సెర్చ్​ చేసుకోవడానికి వీలుండగా ఇప్పుడు దీనికి హిందీని సైతం జత చేసింది.

దీని ద్వారా లోకల్​ నాలెడ్జ్​, ఇన్ఫర్మేషన్​, స్కిల్స్​, మ్యూజిక్​, పర్సనాలిటీ, స్మార్ట్​ హోమ్​, అలారమ్​, వాతావరణం, వార్తలు, లోకల్​ సెర్చ్​ ను సైతం యూజర్లు హిందీలోనే అడిగి తెలుసుకునే అవకాశం లభించనుంది.

దీనికి ముందుగా అలెక్సా వాయిస్​ రిమోట్​ను ఫైర్​ టివి లాంగ్వేజ్​సెట్టింగ్స్ లో హిందీలోకి మార్చుకోవాల్సి ఉంటుంది.

లాంగ్వేజ్​ సెట్టింగ్స్​లో హిందీని ఎలా సెట్​ చేయాలంటే..

– ముందుగా సెట్టింగ్స్​లోకి వెళ్ళండి.
– డివైజ్​ ఆప్షన్స్​ పై క్లిక్​ చేసి డివైజ్​ లాంగ్వేజ్​ను సెలక్ట్ చేయండి.
– ఇంగ్లీష్​, హిందీ ఆప్షన్లలో హిందీని సెలక్ట్​ చేయండి.