అమెజాన్​ : ఇచ్చింది తీసుకుని వెళ్ళిపోండి

By udayam on November 24th / 8:30 am IST

భారత్ లో తమ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను అమెజాన్ వేగవంతం చేసింది. ఈ నెల 30వ తేదీలోపు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కొంత మంది ఉద్యోగులకు నోటీసులు పంపింది. అమెజాన్ ప్రపంచ వ్యాప్తంగా ఈ వారం దాదాపు పది వేల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. భవిష్యత్తులో మరింత మందికి ఉద్వాసన పలికే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కంపెనీలో పని చేస్తున్న అనేక మంది భారతీయ ఉద్యోగులు విఆర్సీ కోసం ప్లాన్​ చేస్తున్నారు. కంపెనీ వారి ఒప్పందాన్ని ముగించే బదులు స్వచ్ఛందంగా రాజీనామా చేయవలసిందిగా అమెజాన్ కూడా కోరుతోంది.

ట్యాగ్స్​