అక్టోబర్​ 4 నుంచి అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ సేల్​

By udayam on September 24th / 11:47 am IST

అక్టోబర్​ 7 నుంచి ఫ్లిప్​కార్ట్​ బిగ్​ బిలియన్​ డేస్​ ప్రారంభం అవుతున్న నేపధ్యంలో దానికి పోటీగా అమెజాన్​ కూడా గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​తో వచ్చేసింది. అయితే ఈసారి ఈ సేల్​ను ఏకంగా నెల రోజుల పాటు నిర్వహించనున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అక్టోబర్​ 4 నుంచి ప్రారంభం అయ్యే ఈ సేల్​లో హెచ్​డిఎఫ్​సి కార్డ్​లకు 10 శాతం తక్షణ రాయితీని ఇస్తున్నట్లు ప్రకటించింది. మొబైల్స్​, స్మార్ట్​ వాచెస్​, ట్యాబ్లెట్స్​, ల్యాప్​టాప్స్​, స్మార్ట్​ టీవీలకు భారీ ఆఫర్లు ఇస్తున్నట్లు ప్రకటించింది.

ట్యాగ్స్​