ఈస్ట్​ ఇండియా కంపెనీలా వ్యవహరిస్తున్న అమెజాన్​

హైకోర్టులో ఫ్యూచర్​ రిటైల్​ వ్యాఖ్యలు

By udayam on November 20th / 2:24 pm IST

తమ కంపెనీ ఫూచర్​ రిటైల్​ లిమిటెడ్​ రిలయెన్స్​ ఇండస్ట్రీస్​లో భాగం కావాలనుకునే విషయంలో అమెజాన్​ కు ఎలాంటి ఇబ్బంది అవసరం లేదని ఢిల్లీ హైకోర్టుకు ఫూచర్​ రిటైల్​ సంస్థ వివరించింది.

ఈ మేరకు కోర్టులో జరిగిన వాదోపవాదాల్లో సీనియర్​ అడ్వకేట్​ హరీష్​ సాల్వే ఫ్యూచర్​ రిటైల్​ తరపున వాదిస్తూ అమెజాన్​ దేశంలోని కంపెనీల పట్ల ఒకప్పటి ఈస్ట్​ ఇండియా కంపెనీలా వ్యవహరిస్తోందని, దేశంలోని పోటీ మార్కెట్​ను దెబ్బతీయాలని చూస్తోందని వ్యాఖ్యానించారు.

‘‘అమెజాన్​కు ఫ్యూచర్​ గ్రూప్​లో ఎలాంటి పెట్టుబడులు లేవు. వారి ప్రొ రేటా పెట్టుబడులు సైతం పది శాతం లోపే ఉన్నాయి. మేం రిలయెన్స్​తో జత కట్టాలనుకుంటుంటే.. అమెరికాలో కూర్చున్న బిగ్​ బ్రదర్​ మాత్రం అడ్డు చెబ్తున్నాడు” అంటూ సాల్వే వాదించారు.

‘‘ఫ్యూచర్​ గ్రూప్​ను, మార్కెట్లో ఉన్న పోటీతత్వ మార్కెట్​ను చంపేయాలని చూసే ఇలాంటి మోనోపోలీ కంపెనీల ఆగడాలను అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అని సాల్వే వాదించారు.