పట్టుమని రూ.150 కూడా పలకని ఓ పింక్ ప్లాస్టిక్ బకెట్‌ను అమెజాన్‌లో రూ.25,999కు బేరి పెట్టాడో సెల్లర్. ఇది చూసిన నెటిజన్లు ఊరుకుంటారా? దానిని స్క్రీన్ షాట్స్ తీసి అమెజాన్‌ను ఉతికారేశారు. పైగా దీని అసలు ధర రూ.35,900లు అని 28 శాతం డిస్కౌంట్‌తో రూ.25,999కే అందిస్తున్నామని అమెజాన్ చెప్పుకొచ్చింది. ఈ బకెట్ కొనేందుకు మంథ్లీ ఈఎంఐ కింద నెలకు రూ.1224 కడితే సరిపోతుందని సైతం పేర్కొంది. ఇది నెటిజన్లు బకెట్‌ను బంగారంతో చేశారేమోనని కామెంట్లు పెడుతున్నారు.