అమెజాన్‌లో 18,000 ఉద్యోగాల కట్​

By udayam on January 6th / 6:29 am IST

అమెజాన్ సంస్థ తన ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా 18,000 ఉద్యోగాలను తొలగించేందుకు నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రభావం ఎవరెవరి మీద ఉంటుందో వారందరికీ జనవరి 18 నుంచి చెబుతామని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆండీ జాసీ సంస్థ సిబ్బంది కోసం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంఖ్య దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులన్న అమెజాన్‌లో దాదాపు 6 శాతం మంది ఉద్యోగాలతో సమానం. సిబ్బంది కోత ఉంటుందని ఈ సంస్థ గత ఏడాది నవంబర్‌లో తెలిపినప్పటికీ ఆ సంఖ్య ఏ స్థాయిలో ఉండవచ్చన్నది అప్పుడు చెప్పలేదు.

ట్యాగ్స్​