అమెజాన్​ మరో షాక్​ : ఆన్​లైన్​ లెర్నింగ్​ ప్లాట్​ ఫాం మూసివేత

By udayam on November 25th / 6:50 am IST

వ్యయ నియంత్రణలో భాగంగా భారీ ఎత్తున ఉద్యోగాలు తొలగించేందుకు సిద్ధమైన అమెజాన్​ ఇండియా ఈ క్రమంలో మరో ప్రకటన చేసింది. భారత యువత కోసం ఇదివరకే తీసుకొచ్చిన ఆన్​ లైన్​ లెర్నింగ్​ ప్లాట్​ ఫాం ను మూసివేస్తున్నట్లు వెల్లడించింది. భారత్‌లో హైస్కూల్ విద్యార్థుల కోసం దీనిని ప్రారంభించగా ఎటువంటి కారణం వెల్లడించకుండానే మూసివేత గురించి ప్రకటించింది. ఇటీవలే భారత్​ లోని కొందరు ఉద్యోగులను స్వచ్ఛందంగా ఉద్యోగాల నుంచి తప్పుకోవాలని ఈ కంపెనీ మెయిల్స్​ పంపిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​