మరో 1200 ల మంది ఉద్యోగులకు అమెజాన్​ గుడ్​ బై

By udayam on January 11th / 7:13 am IST

ఈ–-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ప్రపంచ వ్యాప్తంగా మరో 1200 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుందని సమాచారం. ఇప్పటికే 18వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించాలని నిర్ణయించింది. తాజాగా మరోసారి తొలగింపుల సంఖ్యను పెంచినట్లు బ్లూమ్‌బర్గ్‌ రిపోర్ట్‌ చేసింది. ఇటీవల ప్రకటించిన బ్రిటన్‌లో మూడు వేర్‌హౌస్‌లను మూసివేస్తుండటంతో 1200 మందికి ఉద్వాసన పలకనుందని తెలిపింది. ఉద్యోగాలు కోల్పోయిన సిబ్బందిని ఇతర సేవలు, అమెజాన్‌ సైట్స్‌లో ఉపాధి కల్పిస్తామని ఆ కంపెనీ పేర్కొంది.

ట్యాగ్స్​