ఫ్యూచర్​పై ఆర్​బిఐకి అమెజాన్​ ఫిర్యాదు

By udayam on May 2nd / 6:16 am IST

చూస్తుంటే ఫ్యూచర్​ గ్రూప్​పై అమెజాన్​ పగబట్టినట్లు కనిపిస్తోంది. రిలయెన్స్​ సంస్థ ఫ్యూచర్​ గ్రూప్​ కొనుగోలును ఆపేసిన అనంతరం అమెజాన్​ తన వద్ద ఉన్న అన్ని అస్త్రాలను వాడుకుంటోంది. తాజాగా ఫ్యూచర్​ గ్రూప్​లో 3 ఏళ్ళ నుంచి ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని, ఈ కాలానికి సంబంధించి ఫోరెన్సిక్​ ఆడిట్​ జరపాలని రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియాకు అమెజాన్​ ఫిర్యాదు చేసింది. ఆ సంస్థకు ఉన్న 18,500 ల కోట్ల అప్పును కప్పి పుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అమెజాన్​ ఆరోపించింది.

ట్యాగ్స్​