ఇంట్లో చనిపోయిన వ్యక్తుల గొంతుతో మాట్లాడేలా తమ వాయిస్ అసిస్టెంట్ అలెక్సాను అభివృద్ధి చేస్తున్నట్లు అమెజాన్ సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని టెక్‌క్రంచ్ రిపోర్ట్ చేసింది. దీనిని బట్టి చనిపోయిన వారి గొంతును అనుకరిస్తూ అలెక్సా కుటుంబ సభ్యులతో మాట్లాడుతుందని వివరించింది. ఒక నిమిషం పాటు అలెక్సాతో మాట్లాడినా లేక ఆడియో విన్నా అది మన గొంతును అనుకరిస్తుందని లాస్‌వెగాస్‌లో జరిగిన మార్స్ కాన్ఫరెన్స్‌లో అమెజాన్ తెలిపింది.