జులైలో అంతరిక్షంలోకి బెజోస్​

By udayam on June 8th / 4:06 am IST

అమెజాన్​ అధినేత జెఫ్​ బెజోస్​ తన సొంత కంపెనీ బ్లూ ఆరిజోన్​ అభివృద్ధి చేసిన ఓ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్ళనున్నాడు. ఈ మేరకు ఆయనే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. తనతో పాటు తన సోదరుడు మార్క్​ కూడా ఈ ప్రయాణంలో తోడుంటాడని తెలిపాడు. ‘నాకు 5 ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి అంతరిక్ష ప్రయాణం కోసం కలలు కన్నా. ఈ ఏడాది జులై 20వ తేదీన నా కల నా తమ్ముడితో పాటు తీర్చుకోనున్నా’ అని ప్రపంచ కుబేరుడు వెల్లడించాడు. జులై 5న ఆయన అమెజాన్​ సిఈఓగా దిగిపోనున్న విషయం తెలిసిందే.

ట్యాగ్స్​