తన మాజీ భర్తకు 10 మిలియన్ డాలర్లు చెల్లించాలంటూ కోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపై హాలీవుడ్ నటి ఆంబెర్ హర్డ్.. జానీ డెప్ కు వ్యతిరేకంగా మరోసారి కోర్టు మెట్లెక్కింది. ఈ మేరకు ఆమె వర్జీనియా కోర్టులో కేసు ఫైల్ చేసింది. తాను ఎదుర్కొన్న బాధను పరిగణనలోకి తీసుకోకుండా ఈ తీర్పు వెలువడిందని ఆమె తన పిటిషన్ లో పేర్కొంది. ఆంబెర్ కు 2 మిలియన్ డాలర్లు చెల్లించాలన్న గత తీర్పును జానీ డెప్ సవాల్ చేసిన రెండు రోజుల వ్యవధిలోనే ఆంబెర్ సైతం కోర్టుకెక్కింది.