అమిగోస్ మూవీ నుంచి కళ్యాణ్ రామ్ థర్డ్ లుక్ ను మేకర్స్ రివీల్ చేశారు. డోపుల్ గాంగర్- 3 గా పిలుస్తున్న ఈ లుక్ లో కళ్యాణ్ రామ్ స్టైలిష్ హెయిర్ స్టైల్ లో నెవర్ బిఫోర్ లుక్ తో అదరగొట్టేశాడు. కథను నమ్మే హీరోగా పేరున్న కళ్యాణ్ రామ్ ఈ మూవీతో మరో హిట్ ను ఖాతాలో వేసుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. చేతిలో గన్, జుట్టుకు ముడి, మెరిసిన పొడవాటి గెడ్డం, స్టైలిష్ కళ్ళద్దాలతో కళ్యాణ్ రామ్ హాలీవుడ్ హీరోగా కనిపిస్తూ ఈ మూవీపై అంచనాలను పెంచేశాడు.
#Amigos Teaser out on Jan 8th at 11:07am
Feb 10, 2023 Release #AmigosTeaser #KalyanRam pic.twitter.com/Y2A6hR6gwB
— Telugu Premiere (@TeluguPremiere) January 5, 2023