దేశవ్యాప్తంగా జనగణనను ఈసారి డిజిటల్ పద్దతిలో చేపట్టనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. జనన, మరణ ధృవీకరణ పత్రాలను నేరుగా డిజిటల్ సెన్సస్‌కు అనుసంధానం చేస్తామన్న ఆయన దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తీసుకొస్తున్నట్లు చెప్పారు. 18 ఏళ్ళు నిండిన వారికి ఆటోమేటిక్‌గా ఓటర్ గుర్తింపు కార్డులు జారీ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని 2024 నాటికి పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు.