ఆ క్రికెటర్లకు బహుమతిగా కార్లు

థార్​ ఎస్​యువి కార్లను ఇస్తానన్న ఆనంద్​ మహీంద్ర

By udayam on January 23rd / 12:14 pm IST

ఆస్ట్రేలియా సిరీస్​లో అద్భుత ప్రదర్శన చేసిన భారత యువ క్రికెటర్లకు భారీ బహుమతిని ప్రకటించారు దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్​ మహీంద్ర.

వీరిలో ఫాస్ట్​బౌలర్​ మహ్మద్​ సిరాజ్​, నవదీప్​ సైని, శార్దూల్​ ఠాకూర్​, నటరాజన్​, స్పిన్నర్​ వాషింగ్టన్​ సుందర్​, జట్టు ఓపెనర్​ శుభ్​మన్​ గిల్​లకు ఈ కార్లను బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించారు.

తమ కంపెనీ సరికొత్త ఉత్పత్తి అయిన మహింద్రీ థార్​ (ఎస్​యువి) కారును వీరికి బహుమతులుగా ఇస్తానని ట్వీట్​ చేశారు.