జమ్మూ-కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా డోరూ బ్లాకులోని టెథన్ గ్రామ ప్రజలు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లకు విద్యుత్తు సౌకర్యాన్ని పొందారు. ఇన్నేళ్లు కిరోసిన్ దీపాలు, కొవ్వొత్తుల మధ్యే రాత్రిళ్లు గడిపిన ఆ పల్లెవాసులు తొలిసారిగా లైటు వెలగడం చూశారు. అధికారులు ఎంతో కష్టపడి కొండ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామానికి 63 కేవీ ట్రాన్స్‌ఫార్మరుతో విద్యుత్తు సౌకర్యం కల్పించారు. గ్రామంలో మొత్తం 60 కుటుంబాలతో దాదాపుగా 200 మంది జనం ఉంటారు. గ్రామస్థులు విద్యుత్తు సిబ్బందిని పూలమాలలతో సత్కరించారు. మేళతాళాలతో వేడుక చేసుకున్నారు.