యాంకర్​ ప్రదీప్​ తండ్రి కరోనాతో మృతి

By udayam on May 3rd / 6:59 am IST

తెలుగు బుల్లితెర ప్రముఖ యాంకర్​, నటుడు ప్రదీప్​ మాచిరాజు తండ్రి పాండురంగ మాచిరాజు కరోనాతో మరణించారు. ఆయనకు వయసు 65 సంవత్సరాలు. ప్రస్తుతం ప్రదీప్​కు కూడా కరోనా పాజిటివ్​గా తేలడంతో అతడు సెల్ఫ్​ క్వారంటైన్​ అయ్యాడు. బుల్లితెరలో ఎన్నో సూపర్​హిట్​ ప్రోగ్రామ్​లకు యాంకర్​గా చేసిన ప్రదీప్​ తండ్రి మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాప సందేశాలు పెడుతున్నారు. ఇటీవలే ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ వంటి చిత్రంతో ప్రదీప్​ హీరోగా పరిచయమయ్యాడు.

ట్యాగ్స్​