కేటీఆర్ ని పొగుడుతూ సుమ ట్వీట్​

By udayam on November 21st / 9:58 am IST

స్టార్ యాంకర్ సుమ.. మంత్రి కేటీఆర్ ని పొగడ్తలతో ముంచెత్తుతూ శనివారం ఓ ట్వీట్ చేసారు.

మంత్రి కేటీఆర్‌తో సంభాషిస్తున్న ఫోటోను ట్విటర్‌లో సుమ షేర్ చేస్తూ.. ‘మీతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా నా షోలలో నాన్‌స్టాప్‌గా ఎదో ఒకటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాను. కానీ నాయకత్వ హోదాలో మీరు మాట్లాడే విధానం వినడానికి ఎంతో విలువైనదిగా ఉంటుంది. నిబద్దత, మాట్లాడే విధానం అద్భుతం’ అంటూ కేటీఆర్‌ను పొగడ్తాలతో ముంచెత్తారు. యాదృచ్చికంగా జరిగిందో ,కావాలని ఎన్నికల వేళ సుమ ఇలా చేసారో తెలీదు.

అయితే సుమ ట్వీట్‌పై మిశ్రమ స్పందన వస్తోంది. సుమను కలవడం కేటీఆర్‌ లక్కీ అని కొంత మంది అభిప్రాయపడుతుంటే త్వరలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ తరపున క్యాంపెయినింగ్‌ చేస్తారా ? మరికొంత మంది ఎన్నికల ప్రచారం కోసం కలిశారా అని కామెంట్లు పెడుతున్నారు.

కాగా కొన్ని దశాబ్దాలుగా తన మాటలతో బుల్లితెరపై వినోదాన్ని పంచుతూ అలరిస్తున్న సుమ కనకాల ఇటీవల సుమక్క పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ను కూడా ప్రారంభించి దూసుకెళ్తున్నారు.