ఢిల్లీ పర్యటనలో ఉన్న ఎపి సిఎం వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. 10వ పే కమిషన్ ప్రకారం రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన రూ.32,.625 కోట్ల ను విడుదల చేయాలని జగన్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. డిస్కమ్స్ రీబిల్డింగ్ ప్యాకేజ్, సీనియర్ సిటిజెన్ పెన్షన్లు, రైతుల రుణ మాఫీల కోసం ఈ నిధులు రాష్ట్రానికి రావాల్సి ఉందని జగన్ వివరించారు. తెలంగాణ నుంచి సైతం రూ.6,628 కోట్లు రావాల్సి ఉందని. దీనిపై అధికారులను ఆదేశించాలని ప్రధానికి విన్నవించారు.